తాడ్వాయి, వెలుగు : మేడారం సమ్మక్క, సారలమ్మ, గోవిందరాజు, పగిడిద్దిరాజును సోమవారం ములుగు కలెక్టర్ దివాకర దర్శించుకున్నారు. అనంతరం వనదేవతల పూజారులతో ఐటీడీఏ క్యాంప్ ఆఫీస్లో సమావేశమయ్యారు. ఇటీవల రాతిశిల ఊడి పడి బాలుడికి ప్రమాం జరిగిన ఘటనను పూజారులు కలెక్టర్ దృష్టికి తెచ్చారు. స్పందించిన కలెక్టర్ ప్రమాద ఘటన బాధాకరమని, ప్రభుత్వం దృష్టికి తీసుకు వెళ్తానన్నారు మంత్రి సీతక్కతో మాట్లాడి న్యాయం జరిగేలా చూస్తామని హామీ ఇచ్చారు.
మేడారంలోని ప్రభుత్వ భూమిలో ఎవరు కూడా అక్రమ నిర్మాణాలు చేపట్టవద్దని, అక్రమాలకు పాల్పడితే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఎండోమెంట్ అవసరాల కోసం గతంలో ప్రభుత్వం మేడారం ప్రాంతంలోని నరిజ బంధం గుట్ట వద్ద కేటాయించిన 28 ఎకరాల ప్రభుత్వ భూమిని పరిశీలించారు. నరిజ బంధం గుట్ట చుట్టూ ఉన్న ప్రభుత్వ భూమిలో అక్రమంగా ఏర్పాటు చేసుకున్న షెడ్లను తొలగించాలని రెవెన్యూ అధికారులకు సూచించారు.
